రూమ్ హీటర్... ఈ జాగ్రత్తలు తప్పనిసరి

రాత్రి, పగలు వణికిస్తున్న చలి.

పెరిగిపోయిన రూమ్ హీటర్ల వాడకం.

రూమ్ హీటర్లు వాడే విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి.

ఆరోగ్యం పాడవడం నుంచి ప్రాణాలు పోవడం వరకు అనేక చిక్కులు.

రూమ్ హీటర్స్ మూడు రకాలు.

ఫ్యాన్ హీటర్, రేడియంట్ హీటర్ ధర తక్కువ.

ఫ్యాన్ హీటర్, రేడియంట్ హీటర్‌తో రిస్కులు ఎక్కువ.

కాసేపు ఆన్ చేసి గది వేడెక్కిన తర్వాత ఆఫ్ చేయాలి.

రాత్రంతా ఆన్ చేసి అలాగే ఉంచితే ప్రాణాలకే ముప్పు.

గాలిలో తేమ ఆవిరై, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి.

ఫ్యాన్ హీటర్, రేడియంట్ హీటర్ కొద్దిసేపే వాడాలి.

ఆయిల్ ఫిల్డ్ రూమ్ హీటర్‌తో రిస్క్ తక్కువ.

గాలిలో తేమ, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గవు.

రూమ్ హీటర్ వాడే గదిలో మగ్గులో నీళ్లు పెట్టాలి.

రూమ్ హీటర్లు అతిగా వాడితే చర్మ సమస్యలు, కంటి సమస్యలు.

గుండె సమస్యలు, ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు వాడకూడదు.

వృద్ధులు, చిన్న పిల్లలు రూమ్ హీటర్ ఉపయోగించకూడదు.

రూమ్ హీటర్‌కు ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించాలి.

Watch This- అద్దాల రైలులో వెళ్తారా? విస్టాడోమ్ ట్రైన్ రూట్స్ ఇవే