ఒక్క కౌగిలింత..
బోలెడు
లాభాలు..!

telugu.news18.com

సంతోషం వచ్చినా లేదా బాధ కలిగినా ప్రియమైన వారిని గట్టిగా హత్తుకొని ఎమోషన్స్ వ్యక్తపరిచే అలవాటు చాలా మందికి ఉంటుంది. 

కౌగిలింత లేదా హగ్‌ (Hug)లో ఉన్న శక్తి అంతా ఇంతా కాదు. 

ఆప్యాయంగా ఒక్కసారి కౌగిలించుకుంటే చాలు మనసులో దాగున్న బాధ అంతా ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోతుంది


నిజానికి హగ్ అనేది కౌగిలిలో ఉన్న ఇద్దరికీ మంచి ఫీలింగ్ అందిస్తుంది. 

రోజుకు సరిపడా హగ్స్ ఇచ్చిపుచ్చుకునే వారిలో ఒత్తిడి అనేది ఏ కోశానా కనిపించదు. 

ఒత్తిడి వచ్చే మానసిక సమస్యల్ని నివారించాలంటే ప్రియమైన వారిని ఆప్యాయంగా స్పర్శించడం, కౌగిలించుకోవడం తప్పనిసరి.

కుంగి కృశించిపోకుండా ఉండాలంటే ప్రతి వ్యక్తికి రోజుకు 4 కౌగిలింతలు అవసరమని సైకాలజిస్టులు కూడా చెబుతున్నారు. 

ఒక వ్యక్తిలో దేన్నైనా ఎదుర్కోగల సహనం, ఓర్పు పెరగాలంటే.. వారికి రోజుకు 8 కౌగిలింతలు అవసరం. 

ఒక్క కౌగిలింత ఒక వ్యక్తి మూడ్‌ను ఎంతో హ్యాపీగా మారుస్తుందని ఎన్నో అధ్యయనాలు కూడా తేల్చాయి.

పార్ట్‌నర్ ఇచ్చే హగ్స్‌ కూడా మానసిక ఒత్తిడిని తగ్గించడంలో బాగా హెల్ప్ చేస్తాయి.

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి