వానలో తడిసిన తర్వాత మీ జుట్టు పాడవకుండా కొన్ని పద్దతులు పాటించాల్సి ఉంటుంది.

లేకపోతే జుట్టు దెబ్బతింటుంది. చిక్కులు పడిపోయి కనిపిస్తుంది. ఊడిపోతుంది కూడా. 

ఇంటికి వచ్చిన తర్వాత.. గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. 

వేప చెట్టు ఆకులు వేసి మరిగించిన నీటిని తలస్నానానికి ఉపయోగిస్తే తలభాగంపై సూక్ష్మజీవులు తొలగిపోతాయి.

వేప గుణాలున్న షాంపూ, లేదా సబ్బు ఉపయోగించి స్నానం చేసినా పర్లేదు. 

 తలస్నానం చేసిన తర్వాత జుట్టును సహజంగా టవల్‌తో తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. 

ధూపం, లేదా డ్రయర్​తో ఆరబెట్టుకుంటే మంచిది 

వర్షాకాలంలో జుట్టుకు నూనె షాంపూ, కండిషనర్ తప్ప మరే ఉత్పత్తులూ ఉపయోగించకూడదు.

Your Page!