Telangana Jobs: TSCABలో ఉద్యోగాలు
తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ స్టేట్ కో-ఆపరేటీవ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో మొత్తం 40 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఇందులో స్టాఫ్ అసిస్టెంట్, మేనేజర్ స్కేల్ 1 పోస్టులను భర్తీ చేయనున్నారు.
60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ చేసిన వారు అర్హులుగా పేర్కొన్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ పద్ధతిలో ఉంటుంది.
అధికారిక వెబ్సైట్ https://tscab.org/apex-bank/ ను సందర్శించి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.