Degree-B.Tech Jobs: SSCలో 990 ఉద్యోగాలు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భారత వాతావరణ శాఖలోని పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
990 గ్రూప్ బి నాన్-గెజిటెడ్, నాన్-మినిస్టీరియల్ పోస్టులకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
డిగ్రీలో ఫిజిక్స్ ఒక సబ్జెక్ట్ ఉన్నవాళ్లు ఈ పోస్టులకు అర్హులు.
ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన వారు కూడా అర్హులే.
అక్టోబర్ 18, 2022వ తేదీ నాటికి 30 ఏళ్లకు వయస్సు మించకూడదు.
దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 18, 2022.
కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు https://ssc.nic.in/ను సందర్శించొచ్చు.