FBO-FRO Posts: ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ లో 1665 ఉద్యోగాలు..

తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది.

ఇప్పటికే టీఎస్పీఎస్సీ పలు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.

తాజాగా అటవీ శాఖలో కూడా ఖాళీగా ఉన్న 1665 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రానుంది.

దీనికి సంబంధించి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఆర్ఎం డోబ్రియాల్ తెలిపారు. 

త్వరలోనే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ వంటి కేటగిరీల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ నెలాఖరులో గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రానున్నట్లు సమాచారం. 

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి