Jobs In ONGC: బీటెక్ అర్హతతో ONGCలో ఉద్యోగాలు
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
871 ఏఈఈ, జియాలజిస్ట్, జియోఫిజిసిస్ట్, మెటీరియల్స్ మేనేజ్మెంట్ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది.
అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్లో బీఎస్సీ, బీఈ, బీటెక్, డిప్లొమా, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అలాగే గేట్-2022లో వ్యాలిడ్ స్కోర్ కూడా ఉండాలి.
పోస్టులను బట్టి అభ్యర్థుల వయస్సు 28, 30 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ విధానంలో అక్టోబర్ 12, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపికైన వారికి నెలకు రూ.60,000ల నుంచి రూ.1,80,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
పూర్తి వివరాలకు https://ongcindia.com/ వెబ్ సైట్ సందర్శించి తెలుసుకోవచ్చు.