ఇండియా పోస్ట్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎలక్ట్రీషియన్, పెయింటర్, టైర్ మెన్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తును సమర్పించవచ్చు.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ అక్టోబర్ 19, 2022.
మొత్తం ఖాళీల సంఖ్య 05. అందులో మెకానిక్ – 2, ఎలక్ట్రీషియన్ – 1, పెయింటర్ 1, టైర్ మెన్ – 1 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అభ్యర్థుల యొక్క కనిష్ట వయో పరిమితి 18 సంవత్సరాలు, గరిష్ట వయో పరిమితి - 30 సంవత్సరాలు.
8వ తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్లో ఏడాది పని అనుభవం ఉండాలి.
పూర్తి వివరాలకు indiapost.gov.in/VAS/Pages/Recruitment సందర్శించొచ్చు.