ఇండియన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్‌లో ఒకటైన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) కొత్త జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
కానిస్టేబుల్ నుంచి ఏఎస్సై వరకు.. ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల (Jobs)కు సంస్థ రిక్రూట్మెంట్ చేపడుతోంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 540 పోస్టుల్లో కొత్త వారిని నియమించనున్నారు.
విభాగాల వారీగా ఉద్యోగ ఖాళీలు, అర్హత, అప్లికేషన్ ప్రాసెస్‌తో పాటు ఇతర వివరాలు తెలుసుకుందాం.
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్.. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టుల కోసం తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా 418 హెడ్ కానిస్టేబుల్ పోస్టులను, 122 ASI పోస్టులను భర్తీ చేయనుంది.
అప్లికేషన్ ప్రాసెస్ సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభం కాగా, చివరి తేదీ 2022 అక్టోబర్ 25 వరకు ఉంది.
ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి పూర్తి చేసి ఉండాలి.
అర్హత ఉన్న అభ్యర్థులు CISF అధికారిక వెబ్సైట్ cisfrectt.in నుంచి ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
సంబంధిత లింక్‌పై క్లిక్ చేసి, అవసరమైన అన్ని వివరాలను నింపాలి.
వీటన్నింటినీ మరోసారి క్రాస్ చెక్ చేసి.. ఫోటోగ్రాఫ్, సంతకం, ఇతర డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి.
చివరకు అప్లికేషన్ ఫీజు చెల్లించి, ఫారమ్‌ను సబ్మిట్ చేయండి. తర్వాత దాన్ని ప్రింటవుట్ తీసుకోండి.