నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
57 టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఔత్సాహికుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
రాత పరీక్ష లేకుండానే మెరిట్ ఆధారంగా ఈ రిక్రూట్మెంట్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ ఖాళీల భర్తీకి ఎలాంటి టెస్టుగానీ, ఎంట్రన్స్ గానీ ఉండదు.
కేవలం అభ్యర్థి సాధించిన మార్కుల ఆధారంగానే ఈ ఖాళీల భర్తీ ఉంటుంది.
అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్ స్టిట్యూట్ నుంచి ఇంజినీరింగ్ డిప్లామా పొంది ఉండాలి.
ఆ డిప్లొమాలో కనీసం 60 శాతం మార్కుల కంటే ఎక్కువ సాధించి ఉండాలి.
2020, 2021, 2022 సంవత్సరాల్లో డిప్లొమా పూర్తి చేసుకున్న వాళ్లు ఈ నోటిఫికేషన్ కు అర్హులు.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థికి అక్టోబర్ 1, 2022 నాటికి వయసు 18 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి.
ఈ పోస్టులకు ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేయవచ్చు. అక్టోబర్ 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.