హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. బుకింగ్ ఫ్రీ.!

telugu.news18.com

వార్డ్ విజార్డ్ కంపెనీ 2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన ఈ హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మిహోస్ (Mihos)కి ఆన్‌లైన్ రిజర్వేషన్స్ ప్రారంభమయ్యాయి. (joyebike.com)

ఈ మిహోస్ స్కూటర్‌ను కస్టమర్లు కంపెనీ వెబ్‌సైట్‌లో ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు. మొదటి 5000 మందికి ఈ ఫ్రీ బుకింగ్ ఆఫర్ ఉంది. (joyebike.com)

కస్టమర్లు దేశవ్యాప్తంగా కంపెనీకి ఉన్న 600కి పైగా ఆథరైజ్డ్ షోరూమ్స్‌లో కూడా ఈ బైక్ కోసం బుక్ చేసుకోవచ్చు. మార్చిలో డెలివరీ ప్రారంభమవుతుంది. (joyebike.com)

ఈ స్కూటర్‌ని దేశవ్యాప్తంగా మొదటి 5వేల మంది కస్టమర్లకు రూ.1.49 లక్షల ఎక్స్‌షోరూమ్ ధరతో అమ్మనున్నట్లు కంపెనీ తెలిపింది. (joyebike.com)

ఈ స్కూటర్‌కి పాలీ డిసైక్లో పెంటాడీన్ (PDCPD) టెక్నాలజీ ఉండటం వల్ల ఇది రోడ్లపై తేలిగ్గా వెళ్తుందని కంపెనీ వివరించింది. (joyebike.com)

"ఆటో ఎక్స్‌పోలో మా స్కూటర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనికి PDCPD ఉండటం వల్ల ఇది సురక్షితమైనదిగా ఉంది" అని వార్డ్ విజార్డ్ కంపెనీ ఛైర్మన్ యాతిన్ గుప్తే తెలిపారు. (joyebike.com)

కస్టమర్ల నుంచి స్పందన చూశాక.. ఈ స్కూటర్‌ని ఆన్‌లైన్‌లో ఫ్రీగా బుక్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు యాతిన్ వివరించారు. (joyebike.com)

ఈ స్కూటర్‌కి ఉన్న టాప్-నాచ్ టెక్నాలజీ, హై-ఎండ్ ఫీచర్స్ వల్ల ఇది కస్టమర్లకు సంతృప్తి కలిగిస్తుందనే నమ్మకం ఉందని యాతిన్ తెలిపారు. (joyebike.com)

మిహోస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కి 74V40Ah, 2.5 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది.  (joyebike.com)

ఈ స్కూటర్‌ బ్యాటరీని ఒకసారి ఛార్జ్ చేస్తే... 100కి.మీ వరకూ వెళ్తుందని కంపెనీ తెలిపింది. (joyebike.com)

దీని వెనక చక్రానికి 95 Nm టార్క్ ఉంది. ఈ స్కూటర్ జీరో నుంచి గంటకు 40 కి.మీ వేగాన్ని 7 సెకండ్లలోపు అందుకొంటుంది. ఇది గంటకు 70కి.మీ వేగంతో వెళ్లగలదు. (joyebike.com)

మిహోస్ స్కూటర్‌కి రెండువైపులా డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. అలాగే స్మార్ట్ కనెక్టివిటీ, రిమోట్ ట్రాకింగ్ ఫీచర్, GPS, చోరీ చేసే వీలు లేని యాంటీ-థెఫ్ట్ సిస్టం ఉంది. (joyebike.com)

రివర్స్ మోడ్, రీజనరేటివ్ బ్రేకింగ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. (joyebike.com)

ఇది మెటల్లిక్ బ్లూ, సాలిడ్ బ్లాక్ గ్లాసీ, సాలిడ్ ఎల్లో గ్లాసీ, పెర్ల్ వైట్ కలర్స్‌లో లభిస్తుంది. (joyebike.com)

Watch This- జుట్టు రాలుతోందా.. హార్ట్‌ఎటాక్ వచ్చే ప్రమాదం