సూపర్ స్టైలిష్ బైక్.. 200కి.మీ మైలేజ్

telugu.news18.com

ఈ ఎలక్ట్రిక్ బైక్‌ని రాజస్థాన్.. జోధ్‌పూర్‌లోని డివోట్ మోటార్స్ కంపెనీ తయారుచేసింది. ఈ కంపెనీ అసలు సంస్థ బ్రిటన్‌లో ఉంది.

హై పెర్ఫార్మెన్స్ ఇచ్చే 9.5 kW మోటర్ కలిగివుండటం ఈ బైక్ ప్రత్యేకత.

ఈ బైక్ గంటకు మాగ్జిమం 120కి.మీతో వెళ్తుంది. 

ఒకసారి ఛార్జ్ చేస్తే 200కి.మీ వెళ్తుందని కంపెనీ తెలిపింది. ఫుల్‌గా ఛార్జ్ చెయ్యడానికి 3 గంటలు పడుతుంది.

ఈ బైక్ ఫ్రంట్ వైపు డిస్క్ బ్రేక్ ఉంది. అలాగే దీనికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయిన TFT స్క్రీన్ ఉంది. అంటే దీనికి కీ ఉండదు. కీ లేని టెక్నాలజీ ఇది. అందువల్ల దీన్ని చోరీ చెయ్యలేరని కంపెనీ తెలిపింది.

ఈ బైక్‌కి టైప్ 2 ఛార్జింగ్ పాయింట్ ఉంది. ఇది రైడర్‌కి సౌకర్యవంతంగా ఉంటుంది. 

ఈ బైక్‌కి లిథియం LFP బ్యాటరీ ఉన్నట్లు తెలిపారు. ఇది చాలా మంది బ్యాటరీ అని తెలిపారు.

ఈమధ్యే నోయిడా ఆటో ఎక్స్‌పోలో దీన్ని ప్రదర్శించారు. మరికొన్ని నెలల్లో ఇండియన్ మార్కెట్‌లో ఇది లాంచ్ అవుతుంది.

రిట్రో డిజైన్ ఉండటం వల్ల ఇది కస్టమర్లకు బాగా నచ్చుతుందని కంపెనీ అంచనా వేస్తోంది.

ఈ బైక్ ట్యాంక్, సైడ్ కవర్ ప్యానెల్స్‌కి రకరకాల పెయింట్ ఆప్షన్స్ ఉన్నట్లు తెలిపింది.

ఈ బైక్ 3 రంగుల్లో లభించే అవకాశం ఉంది. దీని ధర ఎంతో కంపెనీ ఇంకా చెప్పలేదు.

Watch This- రంగనాయక సాగర్ చూసి తీరాల్సిందే