బంగారానికి వాస్తు రూల్స్.. పాటిస్తే అదృష్టం 

telugu.news18.com

స్వర్ణాన్ని సరిగా పట్టించుకోకపోతే.. ఇంట్లోకి దరిద్రదేవత ప్రవేశిస్తుంది. నెగెటివ్ ఎనర్జీ వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంటుంది.

బంగారాన్ని ఇంటి ఆగ్నేయ మూలలో ఉంచాలి. ఇది శ్రేయస్సు, సంపద, అదృష్టం తెస్తుందని నమ్ముతారు.

బంగారాన్ని ఓపెన్‌గా కాకుండా... సేఫ్ లేదా లాకర్‌లో భద్రపరచాలి.

బంగారు నగలు ధరించి నిద్రపోవద్దు. నగలు ధరించి... ఈత కొట్టడం, స్నానం చేయడం లేదా గిన్నెలు కడగడం వంటి నీటితో కూడిన చేయవద్దు.

బంగారాన్ని నడుముకి పైనే ధరించాలి. నడుము కింద ధరిస్తే దురదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు.

బంగారు బహుమతులు ఇచ్చేటప్పుడు... 3, 5, 7, లేదా 9 వంటి బేసి సంఖ్యల ముక్కలను ఇవ్వడం ఉత్తమం. ఇది గ్రహీతకు అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు.

బంగారాన్ని ఎప్పుడూ శుభ్రంగా, పాలిష్‌ చేసి ఉంచాలి. అది సంపద, శ్రేయస్సును ఆకర్షిస్తుంది.

ఈ నియమాలను అనుసరించడం వల్ల మీ ఇంటికి, జీవితానికి సంపద, శ్రేయస్సు వస్తుంది. అదృష్టం కలిసొస్తుంది.

Disclaimer: ఈ ఆర్టికల్‌లోది సమాచారం సమాచారం మాత్రమే. దీన్ని న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.

Watch This- పరీక్షలకు టీ తాగుతూ చదువుతున్నారా?