ఇంట్లో ఎన్ని శివలింగాలు ఉండాలి? 

శివలింగానికి పూజ చేయాలని చాలా మందికి ఉంటుంది. ఇంట్లో శివలింగాలను ప్రతిష్టించుకోవడం చాలా మందికి ఇష్టం. 

ఐతే... శివలింగంతోపాటూ... కొన్ని నియమనిష్టలు తప్పక పాటించాలి. 

ఒకేసారి పూజలో ఎన్ని శివలింగాలు ఉంచాలనే అంశంపైనా నియమాలు ఉన్నాయి. 

పండితుల ప్రకారం... ఇంట్లో ఒకసారి ఒక పూజ సమయంలో ఒకటి కంటే ఎక్కువ శివలింగాలు ఉండకూడదు. 

ఒకటి కంటే ఎక్కువ ఉంటే... ఆ పూజా విధానంలో విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. 

అందువల్ల ఇంట్లోని పూజ గదిలో ఒకే శివలింగం ఉంచి.. రోజూ దానికే పూజ చేసుకోవడం వల్ల అన్ని విధాలా మేలు. 

మీరు శివలింగం ఎప్పుడూ దక్షిణం వైపు చూస్తున్నట్లు ఉంచాలి. 

తద్వారా మీకు కలిగిన నష్టాలు, కష్టాలూ తొలగిపోతూ... అదృష్టం కలిసొస్తుందని పండితులు చెబుతున్నారు. 

మీరు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో తెల్లటి శివలింగం తెచ్చుకోకూడదు. 

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి