వెండి నగలు, ముత్యాల హారాలు ధరించడం సర్వ సాధారణం
జ్యోతిషశాస్త్రం ప్రకారం అవి కొందరికి హాని చేస్తాయి
జ్యోతిష శాస్త్రం ప్రకారం వెండి అంటే చందమామ
జ్యోతిష శాస్త్రం ప్రకారం ముత్యం అంటే శుక్రగ్రహం
వాటిని జ్యోతిష శాస్త్రం ప్రకారమే ధరించాలని పండితులు చెబుతున్నారు
మీరు ఎమోషనల్ టైపైతే ముత్యాల హారాలు, వెండి నగలు వాడకూడదు
మీకు చందమామ 12వ లేదా 10వ గృహంలో ఉంటే ముత్యాలు ధరించకూడదు
వృషభం, మిథునం, కన్య, మకరం, కుంభ వారు ముత్యాల నగలు ధరించకూడదు
శుక్రుడు, బుధుడు, శని ప్రభావం ఉండే రాశులవారు ముత్యాలు ధరించకూడదు
ముత్యాలతో వజ్రాలు, పచ్చ, నీలమణి, గోమేధిక మణి కలిపి వాడకూడదు
ముత్యాలతో పసుపు పుష్పరాగం, పగడాలు మాత్రమే కలిపి తొడుక్కోవచ్చు
మేషం, సింహం, ధనస్సు రాశుల వారు వెండి నగలు వాడకూడదు
చందమామ అనుకూలంగా లేనప్పుడు వెండి, ముత్యాల వస్తువుల్ని ఇవ్వకూడదు, తీసుకోకూడదు.
ఇవి జ్యోతిష పండితుల అభిప్రాయాలు. న్యూస్18 తెలుగు వీటిని ధ్రువీకరించట్లేదు.