కరోనావైరస్ నివారణకు ఒక్కటే మార్గం..సామాజిక దూరం..! అవును జనాలకు కాస్త దూరంగా ఉంటే.. కరోనా రాకుండా కాపాడుకోవచ్చు. అవతలి వారికి సోకకుండా అడ్డుకోవచ్చు. ఈ ఫార్ములాను మందు బాబులు పక్కాగా ఫాలో అవుతున్నారు. కేరళలోని పాలక్కడ్ జిల్లా అలాతూర్లోని వైన్ షాప్ వద్ద క్యూలైన్లో మందుబాబులు దూరం దూరంగా నిల్చున్నారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.