హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: కరోనా ఎఫెక్ట్... టాయిలెట్ పేపర్ కోసం తెగ కొట్టేసుకున్న మహిళలు

అంతర్జాతీయం16:16 PM March 08, 2020

Coronavirus : ఆస్ట్రేలియా... న్యూ సౌత్ వేల్స్‌ పోలీసులు... ఇద్దరు మహిళల్ని అదుపులోకి తీసుకున్నారు. ఒకరి వయసు 23 ఏళ్లు, మరొకరి ఏజ్ 60 ఏళ్లు. వాళ్లిద్దర్నీ కోర్టు ముందు హాజరుకమ్మని ఆర్డరేశారు. అందుకు ఏప్రిల్ 28 డేట్ ఫిక్స్ చేశారు. ఇంతకీ వాళ్లు చేసిన నేరమేంటంటే... టాయిలెట్ పేపర్ కోసం సూపర్‌మార్కెట్‌లో కొట్టుకోవడం. అసలీ సమస్యంతా ఎక్కడొచ్చిందంటే... ఆస్ట్రేలియా ప్రభుత్వం టాయిలెట్ పేపర్లను చైనా లాంటి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇప్పుడు కరోనా ఏడిపిస్తోంది కదా... అందువల్ల చాలా వస్తువుల దిగుమతులు తగ్గిపోయాయి. టాయిలెట్ పేపర్ల దిగుమతి మాత్రం తగ్గలేదు. కానీ... దిగుమతి తగ్గవచ్చనే ఉద్దేశంతో... సూపర్ మార్కెట్లలో ఒక్కో వ్యక్తికీ... ఒక ప్యాకెట్ మాత్రమే అమ్ముతున్నారు. ఐతే... ప్రజలు మాత్రం ఎక్కువెక్కువ కావాలంటూ... ఎక్కడ టాయిలెట్ పేపర్లు ఉన్నా... అమాంతం వెళ్లి కొనేస్తున్నారు. మున్ముందు దొరకవేమో అని ఇప్పుడే కంగారుపడిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఓ సూపర్ మార్కెట్‌లో ఓ యువతి తన ట్రాలీ నిండా... టాయిలెట్ పేపర్ బండిల్స్ ప్యాకెట్లను నింపేసుకుంది. అందులోంచీ తనకు ఓ ప్యాకెట్ ఇమ్మని 60 ఏళ్ల మహిళ అడిగింది. అందుకు ఆ యువతి ఒప్పుకోలేదు. "ముందు నేను తీసుకున్నాను... కాబట్టి నావే" అంది. "అంత లేదు... ఒక మనిషికి ఒక ప్యాకెట్టే... కాబట్టి... నాకో ప్యాకెట్ ఇవ్వాల్సిందే" అంది ముసలామె. అందుకు యువతి "నో" అంది. అక్కడ ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. తిట్టుకున్నారు, కొట్టుకున్నా్రు. యువతి తరపున మరో మహిళ ఎంటరవ్వడంతో... ముసలామె వెనక్కి తగ్గింది. బట్... విషయం పోలీసులకు చేరింది. వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది వాళ్లు ఎంతలా కొట్టుకున్నారో.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading