హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : కొడుకు కోసం తల్లీ సాహసం.. స్కూటీపై 1400 కిలోమీటర్ల ప్రయాణం

ట్రెండింగ్23:35 PM April 09, 2020

కొడుకును చూడకుండా ఆ మహిళ ఉండలేకపోయింది. లాక్ డౌన్ కారణంగా రోజులు గడుస్తున్నా తన కుమారుడు తన దగ్గరకు రాలేకపోతున్నాడనే బాధ ఆమెను ఓ పట్టాన ఉండనివ్వలేదు. దీంతో ఏదైతే అది జరుగుతుంది అనుకుని... కుమారుడిని తీసుకొచ్చేందుకు స్కూటీ ఎక్కి బయలుదేరింది ఆ మహిళ. ఏకంగా 1400 కిలోమీటర్లు ప్రయాణం చేసి కన్న కొడుకును తన ఇంటికి తెచ్చుకుంది. వివరాల్లోకి వెళితే... తెలంగాణలోని బోధన్‌కు చెందిన రజియా అనే ఉపాధ్యాయురాలు కుమారుడు నిజాముద్దీన్ కొన్నాళ్ల క్రితం తన స్నేహితుడు ఉంటున్న నెల్లూరులోని రెహ్మతాబాద్‌కు వెళ్లాడు. లాక్ డౌన్ కారణంగా తిరిగి రాలేక అక్కడే చిక్కుకుపోయాడు. దీంతో కుమారుడిని తిరిగి బోధన్ రప్పించేందుకు అనేక ప్రయత్నాలు చేసిన రజియా... అవేవీ సఫలం కాకపోవడంతో స్కూటీపై నెల్లూరు జిల్లాకు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఓ పోలీసు ఉన్నతాధికారి నుంచి అనుమతి పత్రాన్ని తీసుకుని తన ప్రయాణాన్ని సాగించింది. ఎండ, ఆకలి వంటి ఇబ్బందులను లెక్క చేయకుండా నెల్లూరు జిల్లా రెహ్మతాబాద్‌లోని తన కుమారుడి దగ్గరకు చేరుకుంది. అతడితో కలిసి తిరిగి బోధన్ చేరుకుంది. మూడు రోజుల్లో స్కూటీపై 1400 కిలోమీటర్లు ప్రయాణించింది. తన ప్రయాణానికి సహకరించిన ఇరు రాష్ట్రాల పోలీసులకు రజియా కృతజ్ఞతలు తెలిపింది. తాను పడిన కష్టం తనకు లెక్క కాదని... తన కుమారుడిని తిరిగి తన దగ్గరకు తీసుకురావడం తనకు సంతృప్తి కలిగించిందని ఆమె తెలిపింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading