ప్రఖ్యాత అజ్మీర్ దర్గాలోపలికి ఆయుధం లాంటి ఓ వస్తువును భక్తుడు తీసుకురావడంతో.. అతడ్ని వారించారో మహిళా కానిస్టేబుల్. దీంతో ఆమెపై కోపంతో ఊగిపోయి.. తిట్ల దండకం అందుకున్నాడు. చాలా సేపు ఓపిక పట్టిన ఆ కానిస్టేబుల్, అతడి వ్యాఖ్యలు శ్రుతిమించడంతో చెంప చెల్లుమనిపించింది. బయటికి వెళ్లిపో అంటూ గెంటేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది.