హైదరాబాద్... ఫోరం మాల్లో చాలా మంది లాగే ఆ కుర్రాడు కూడా సినిమా చూసేందుకు వచ్చాడు. ముందుగా జాతీయ గీతం జనగణమన ఆలాపన వచ్చింది. థియేటర్లో ప్రేక్షకులంతా లేచి నిలబడ్డారు. ఆ కుర్రాడు మాత్రం సెల్ఫోన్లో ఏదో చూసుకుంటూ కూర్చున్నాడు. గీతాలాపన పూర్తవగానే పక్కనున్న ప్రేక్షకులు అతనిపై మండిపడ్డారు. జాతీయ గీతానికి రెస్పెక్ట్ ఇచ్చే పనిలేదా? నిలబడిన వాళ్లంతా పిచ్చోళ్లనుకున్నావా అని ఫైర్ అయ్యారు. అలా నిలబడాలని రూలేమీ లేదు... సుప్రీంకోర్టు చెప్పింది కదా అని ఆ కుర్రాడు బదులిచ్చాడు. థియేటర్లో నిలబడితేనే దేశభక్తి అవుతుందా అన్న నటుడు పవన్ కళ్యాణ్ డైలాగ్‌ని అతను గుర్తుచేశాడు.