రోడ్డుపై ఒక్క సింహం కనిపిస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది ఏకంగా 20 సింహాలు రోడ్డుపైకి వచ్చి దర్జాగా వెళ్తుంటే... హడలెత్తకుండా ఉంటారా. దక్షిణ ఆఫ్రికాలో ఓ రోడ్డుపై సింహాలు నడుస్తున్న వీడియోను... ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత్ నందా తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఇప్పుడది వైరల్ అయ్యింది. చాలా మంది ఈ వీడియో చూసి... అమ్మో అలా సింహాలు మన ముందుకి వస్తే... ఇంకేమైనా ఉందా అని మాట్లాటుకుంటున్నారు. ఇదివరకు కూడా సుశాంత్ ఇలాంటి చాలా వీడియోల్ని పోస్ట్ చేశారు.