హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: పిల్ల ఎలుగు వీడియో వైరల్... జంతు ప్రేమికులు ఫైర్

ట్రెండింగ్15:32 PM November 09, 2018

యుద్ధంలో ఓడిపోయి నిరాశతో కూర్చున్న ఓ రాజు... చీమ పట్టుదల చూసి గుణపాఠం నేర్చుకున్నాడని చిన్నప్పుడు పాఠ్యాపుస్తకాల్లో చదివాం. ఎన్ని సార్లు పడిపోయినా పట్టు వదలకుండా ప్రయత్నిస్తూనే ఉంటుందా చీమ. అచ్చం ఇలాగే ఓ ఎలుగు బంటి పిల్ల కూడా మంచుపర్వాతాన్ని ఎక్కేందుకు మళ్లీ మళ్లీ ప్రయత్నం చేసి విజయం సాధించింది. మూడు సార్లు పడిపోయినా తన పర్వత శిఖరాన ఉన్న తల్లిని చేరుకునేందుకు పట్టువదలకుండా ప్రయత్నించి సక్సెస్ అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఈ వీడియో తీసేందుకు ఉపయోగించిన డ్రోన్ కారణంగానే ఆ తల్లీ, పిల్ల ఎలుగును అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లేందుకు ప్రయత్నించాయని తేలింది. జంతువుల వీడియోలు తీసేందుకు ఇలా జంతువులను ఇబ్బందుల్లోకి నెట్టేసిన ఆ శాస్త్రవేత్తలపై మండిపడుతున్నారు జంతుప్రేమికులు...

Chinthakindhi.Ramu

Top Stories

corona virus btn
corona virus btn
Loading