జిమ్నాస్టిక్స్కి సంబంధించి ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అమెరికా... నాష్విల్లేలో ట్రైనింగ్ సెషన్లో ప్రాక్టీస్ చేస్తున్న యువతి... జిమ్నాస్టిక్స్ చేస్తూ... కొద్దిలో పట్టు తప్పింది. దాంతో... ఆమె పై నుంచీ కింద పడేదే. అదే సమయంలో ఆమె కోచ్... అత్యంత వేగంగా స్పందిస్తూ ఆమెను కాపాడారు. పొరపాటున ఆ సమయంలో కోచ్ ఆమెను పట్టుకోకపోయి ఉంటే... ఆ యువతికి కాళ్లో, చేతులో విరిగిపోయేవే. అందుకే ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జిమ్నాస్టిక్స్ చూడటానికి ఎంత బాగుంటుందో, చెయ్యడానికి అంత డేంజరస్ గేమ్. బాడీలో పార్ట్స్ అన్నీ కంట్రోల్లో ఉండాలి... కంటి చూపు కరెక్టుగా ఉండాలి. ఏకాగ్రతతో చెయ్యాలి. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా... తీరని నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది.