సోషల్ మీడియాలో ఓ జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ వీడియో వైరల్ అవుతోంది. సాధారణంగా ఫుడ్ డెలివరీ బాయ్స్ బైక్స్ వాడతారు. కానీ అతడు మాత్రం మూడు చక్రాల సైకిల్‌ను వాడతాడు. ఎందుకంటే అతడు నడవలేడు. కాళ్లు లేకున్నా పనిచేయాలన్న కసి మాత్రం ఉంది. జీవితంపై ఓ క్లారిటీ ఉంది. అందుకే మూడు చక్రాల బండిపై ఫుడ్ డెలివరీ చేస్తూ యువతకు ఆదర్శంగా నిలిచాడు.