కరోనాపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి. సామాజిక దూరం పాటించాలంటూ.. అదే మనకు శ్రీరామ రక్ష అని పదే పదే చెబుతున్నాయి. ఈ క్రమలో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో పోలీసులు వినూత్నంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యుముడి గెటప్‌లో స్థానికులకు సూచనలు చేశారు. సామాజిక దూరం పాటించకుండా.. ఇళ్ల నుంచి బయటకు వస్తే.. కరోనా వల్ల ప్రాణాలు పోతాయని హెచ్చరించారు