హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : భక్తి శ్రద్ధలతో ఊర పండుగ... ప్రత్యేకతలు ఇవీ...

ట్రెండింగ్13:05 PM July 21, 2019

హైదరాబాద్ లోని మహంకాళి బోనాలకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో నిజామాబాద్‌లో ఏటా జరిగే ఊర పండగకు కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. ఈసారి కూడా ప్రజలు ఊర పండుగను జిల్లాలో ఘనంగా నిర్వహించుకున్నారు. పాడి పంటలు బాగా పండి, అందరూ సుఖసంతోషాలతో జీవించాలంటూ గ్రామ దేవతల విగ్రహాల్ని పొలిమేర్లలో ప్రతిష్టించారు. అంటు రోగాలు ప్రబలకుండా జన జీవనాన్ని కాపాడాలని భక్తిశ్రద్ధలతో ప్రజలు వేడుకున్నారు. నిజామాబాద్ నగరంలోని సర్వసమాజ్ కమిటీ పర్యవేక్షణలో గ్రామ సేవకుల సహకారంతో ఈ ఉత్సవాలు ఘనంగా జరగడం ఆనవాయితీగా వస్తోంది. 1935లో వచ్చిన గత్తర అనే అంటు వ్యాధిని అరికట్టేందుకు అప్పటి ప్రజలు గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు చేశారు. కోళ్లు, మేకల్ని బలి ఇచ్చారు. అప్పట్లో వ్యాధి తగ్గిపోవడంతో... అప్పటి నుంచీ ఏటా ఊర పండుగ జరుపుతున్నారు. గ్రామ దేవతలైన మహాలక్ష్మి, సారలమ్మ, కొండయ్య, భోగం సాని, పోచమ్మల విగ్రహాల్ని ఏటా కొత్తగా తయారుచేసి నగర పొలిమేర ఆలయాల ప్రాంగణాల్లో ప్రతిష్టించడం ఈ గ్రామ పండగ ప్రత్యేకత. దేవతల ఊరేగింపు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading