హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : శ్రీశైలానికి పర్యాటకులు... డ్యామ్ దగ్గర ట్రాఫిక్ జామ్

ఆంధ్రప్రదేశ్11:46 AM August 11, 2019

దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ శ్రీశైలం డ్యామ్ నిండుకుండలా మారింది. ఇన్‌ఫ్లో 6 లక్షలు దాటడంతో... 10 గేట్లు 20 అడుగుల ఎత్తుకు ఎత్తి... 4,62,200 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఐతే... వీకెండ్ కావడంతో... శ్రీశైలం ప్రాజెక్టును చూసేందుకు పర్యాటకులు ఒక్కసారిగా పెరిగిపోయారు. పాలనురగలా వెల్లువెత్తుతున్న కృష్ణమ్మ పరవళ్లను సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఫలితంగా ఆ డ్యామ్ చుట్టూ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇవాళ ఆదివారం కావడం వల్ల టూరిస్టుల సంఖ్య మరింత పెరిగింది. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వస్తున్న భక్తులు, యాత్రికులు... అక్కడి చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాల్నీ, నల్లమల్ల అడవుల్ని చూస్తూ... అదే సమయంలో శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తడంతో... ఇక్కడకూ వస్తున్నారు. కార్లు, బైకులపై వస్తున్నవారు... వాహనాల్ని పార్క్ చేసేందుకు అక్కడ సరిపడా ప్లేస్ లేకపోవడం సవాలవుతోంది. ఘాట్ రోడ్డులో వాహనాలు నిలుపుతుండటం వల్ల అక్కడ రవాణాకు సమస్యలు తలెత్తుతున్నాయి.

Krishna Kumar N