గత కొన్నేళ్లుగా హీరో, హీరోయిన్లు కేవలం నటనకే పరిమితం కాకుండా.. సామాజిక బాధ్యతగా తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన సూచనలను అభిమానులకు తెలియజేసారు. ఆ తర్వాత మహేష్ బాబు, చిరంజీవి కూడా కరోనా పై భయపడాల్సిన అవసరం లేదు. అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సోషల్ మీడియా వేదికగా అభిమానులకు సామాన్య ప్రేక్షకులకు అవగాహన కల్పించారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత .. కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చేతులను ఎలా శుభ్రపరుచుకోవాలో తెలియజేస్తూ.. ఒక వీడియోను రిలీజ్ చేసింది.