రైళ్లు, గూడ్స్ బండ్లు నిలిచి ఉన్నప్పుడు వాటి కింద నుంచి దూరి వెళ్లొద్దని రైల్వే శాఖ ఎన్నిసార్లు మొత్తుకున్నా ఎవరూ వినడం లేదు. ఇంకా కొందరు అలా చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవల మహారాష్ట్రలోని లోనావాలా రైల్వే స్టేషన్లో ఓ బామ్మ అలాగే ప్రాణాల మీదకు తెచ్చుకుంది. గూడ్స్ బండి కింద నుంచి ఆమె దాటబోతున్న సమయంలో రైలు కదిలింది.