నాగర్ కర్నూల్- కల్వకుర్తి ప్రధాన రహదారిలో మిషన్ భగీరథ పైప్లైన్ పగిలిపోయింది. దీంతో నీరు ఒక్కసారిగా 60 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడింది. దీంతో రోడ్డంతా నీరు ప్రవహించడంతో కొద్దిసేపు రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న అధికారులు.. నీటి సరఫరా నిలిపివేసి రాకపోకలను పునరుద్ధరించారు.