హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : నగరిలో సీఎం కేసీఆర్‌కి ఎమ్మెల్యే రోజా స్వాగతం

ఆంధ్రప్రదేశ్14:47 PM August 12, 2019

దైవ చింతన ఎక్కువగా కలిగివుండే కేసీఆర్... అరుదైన ఆలయాన్ని దర్శించుకోవడానికి కంచికి వెళ్తుండటం చర్చనీయాంశం. ఆయన వెంట ఎమ్మెల్యే రోజా కూడా పయనమయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... తమిళనాడులోని... కంచిలో ఉన్న శ్రీఅత్తివరదరాజ స్వామి ఆలయానికి వెళ్లున్నారు. హైదరాబాద్ నుంచీ ప్రత్యేక విమానంలో బయలుదేరి రేణిగుంట విమానాశ్రయంలో దిగిన కేసీఆర్... కాంచీపురం బయలుదేరారు. మార్గమధ్యంలో నగరి దగ్గర ఎమ్మెల్యే రోజా ఆయనకు స్వాగతం పలికారు. ఎమ్మెల్యే రోజా కూడా కేసీఆర్‌తో కలిసి కాంచీపురం బయలుదేరారు. కంచిలో శ్రీఅత్తివరదరాజ స్వామి వారిని దర్శించుకునేందుకు కేసీఆర్... రోడ్డు మార్గంలో బయలుదేరారు. స్వామిని దర్శించుకున్న తర్వాత ఆయన తిరిగి తిరుమలకు రానున్నారు. సాయంత్రం కేసీఆర్... తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత రేణిగుంట విమానాశ్రయం చేరుకొని తిరుగు ప్రయాణం అవుతారు. ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వాధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు.

Krishna Kumar N