హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

VIDEO: కుక్కకి‌ పెద్దకర్మ ... ఖమ్మంలో అనుబంధాన్ని చాటుకున్న కుటుంబం

ట్రెండింగ్12:05 PM January 13, 2019

ఖమ్మం జిల్లా సత్తుపల్లి‌ మండలం యాతాలకుంట గ్రామానికి చెందిన కోటేశ్వరరావు విజయవాడలో రైల్వే ఉద్యోగిగా పని చేస్తున్నాడు. కోటేశ్వరరావు, రమణమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. కూతురు రూపాదేవి, కొడుకులు శివకృష్ణ, సాయికృష్ణ అందరూ విజయవాడలో ఉంటున్నారు. తమకు కాపలా కోసం 14 ఏళ్ల కిందట ఓ కుక్క పిల్లని తెచ్చిన కోటేశ్వరరావు... దానికి మిన్ని అని‌ పేరు పెట్టాడు. అప్పటి నుంచీ దాన్ని కూడా ఇంట్లో మనిషిగా భావించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఇటీవల అది అనారోగ్యంతో చనిపోయింది. మనిషికి ఎలా దహన సంస్కారాలు చేస్తారో, మిన్నీకి కూడా అలాగే అంతక్రియలు చేశారు. పండితులు చెప్పినట్లు యాతాలకుంట గ్రామంలో పెద్దకర్మను భారీగా నిర్వహించారు. శ్రద్ధాంజలి ప్లెక్సీలు ఏర్పాటుచేసి ఊళ్లో ప్రజలు, బంధువులందర్నీ పిలిచి, భోజనాలు పెట్టారు. మిన్ని (కుక్క) జ్ఞాపకంగా పెద్ద కర్మకు వచ్చిన ప్రతివారికీ ఓ‌ స్టీల్‌ గ్లాస్‌ని ఇచ్చారు కోటేశ్వరరావు దంపతులు. మిన్నీ లేని లోటు మాకు ఎప్పటికీ తీరదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పెంపుడు కుక్కతో వారికి ఏర్పడిన అనుబంధాన్ని చూసి ఊరంతా ఆశ్చర్యపోయారు.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading