బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్‌పై హీరోయిన్ తనుశ్రీదత్తా చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు బాలీవుడ్లో పెను భూకంపం సృష్టిస్తున్నాయి. తాజాగా తనుశ్రీదత్తా ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించిన మహారాష్ట్ర స్టేట్ ఉమెన్స్ కమిషన్... నానా పటేకర్‌తో పాటు ఈ వివాదంలో సంబంధం ఉన్న డ్యాన్స్ మాస్టర్ గణేశ్ ఆచార్య, సమీర్ సిద్ధికీ, రాకేశ్ సారంగ్లకు నోటీసులు పంపించింది. ఈ కేసులో కమిషన్ ముందు హాజరై పూర్తి వివరాలు సమర్పించాలని కోరడంతో తనుశ్రీదత్తా... బురఖాలో వెళ్లింది.