హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : ఆ బడికి వెళ్లాలంటే బస్సు టాప్ ఎక్కాల్సిందే...

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని శెట్టూరు మండలం అయ్యగార్లపల్లిలో స్కూల్ పిల్లల దుస్థితి ఇది. చదువుకోవాలంటే వందల మంది పిల్లలు శెట్టూరుకు వెళ్ళాలి. అలా వెళ్లాలన్నా రావాలన్నా బస్సు సౌకర్యాలు లేక ఇలా రోజు బస్సు టాపుపై ఎక్కి... పిల్లలు ప్రయాణించాల్సి వస్తోంది. ఇంతకు ముందు ప్రభుత్వం ఇక్కడ ఆరు, ఏడు తరగతుల్ని రద్దు చేసింది. దాంతో పిల్లలు అవస్థలు పడుతున్నారు. తరగతులు రద్దైతే చేశారు గానీ... పక్క గ్రామాలకి పిల్లలు ఎలా వెళతారు అనే కానీస జ్ఞానం కూడా లేకుండా చేశారు. ఇలా బస్ టాపుపై ప్రయాణం చేసేటప్పుడు కింద పడితే ఎవరు బాధ్యులు అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం, నాయకులు గుర్తించి కొత్త బస్సు సర్వీసులు నడపాలనీ, ఉన్న సర్వీసులు వేళకు... పిల్లలకు అనుకూల టైంకి వచ్చేటట్టు చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading