నేటి ఉదయం భద్రాచలం దివ్యక్షేత్రంలో శ్రీసీతారాముల కల్యాణోత్సవాన్ని పురోహితులు నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. నుదుటిన కస్తూరి నామం బుగ్గన చుక్కతో కళ్యాణానికి సిద్దమైన భద్రాద్రి రామయ్య....పక్కన సోదరుడు లక్ష్మణుడు వున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో భక్తులు లేకుండానే పూజారులు శ్రీ సీతారాముల కల్యాణం జరిపిస్తున్నారు.