శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కాలువల్లో నీటి ప్రవాహం లేకపోవడంతో మొసళ్ళు పంటపొలాలు, బురద గుంటల్లోకి వస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని మెండోరా గ్రామ శివారులోని పెద్దమ్మ ఆలయం వద్ద ఓ ముసలి కనిపించింది. స్థానిక రైతులు ఆ మొసలిని పట్టుకొని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. స్థానిక కాకతీయ కాలువలో నీరు లేకపోవడం వల్లే మొసలి ఒడ్డుకు చేరిందని గ్రామస్థులు వెల్లడించారు.