విలక్షణ నటుడు కమల్‌హాసన్ కూతురు శ్రుతిహాసన్ తనలోని మరో టాలెంట్‌ను బయటపెట్టింది. నటనతో పాటు సంగీతం లో కూడా మంచి పట్టు ఉన్న శృతి అప్పుడప్పుడు కొన్ని పాటలు పాడుతూనే సంగీత దర్శకురాలిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు శృతిహాసన్ తమిళనాడులో ఎక్కువగా వాయించే ‘పరాయ్’ను వాయిస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో డప్పు వాయిస్తూ దానికి అనుగుణంగా కాలు కదుపుతూ అదరగొట్టింది .