కర్ణాటకలో జరిగిందీ చిత్రం. ఓ లిక్కర్ షాప్ యజమాని బోల్డంత పెట్టుబడి పెట్టి... పెద్ద సంఖ్యలో మద్యం బాటిళ్ల కేసులు స్టాక్ పెట్టి... కొత్తగా షాప్ ప్రారంభించారు. మామూలుగా ఏ షాపైనా ఓపెన్ చేసినప్పుడు... దేవుళ్ల పటాలకు పూజలు చేస్తారు. ఆ షాప్ ఓనర్ మాత్రం దేవుళ్ల పటాలకు బదులు మద్యం బాటిళ్లను పెట్టి... వాటికే దండలు వేసి... పూజలు చేసి... హారతులు ఇచ్చాడు. ఇదేం ఆనందం అంటూ చుట్టుపక్కల కొందరు వీడియోలు తీసుకున్నారు. కలికాలం అని మరికొందరు అనుకున్నారు.