తమిళనాడులోని కోయంబత్తూర్ నంజుందాపూర్ చెక్ డ్యాం వద్ద దారుణం చోటుచేసుకుంది. ఓ టెక్స్‌టైల్ కంపెనీ నుంచి వెలువడిన విష రసాయనాలు నీళ్లలో కలిసిపోవడంతో ఆ నీటిలో ఉన్న చేపలన్నీ చనిపోయాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. వేలాది చేపలు జీవచ్ఛవాలుగా మారాయి.