హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన సీనియర్ హీరోయిన్ కౌసల్య..

ట్రెండింగ్18:03 PM February 09, 2020

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఆదివారం అమీర్ పేటలోని సారథి స్టూడియోలో మొక్కలు నాటారు సీనియర్ హీరోయిన్ కౌసల్య. ఈ సందర్భంగా కౌసల్య మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటే అవకాశం నాకు లభించడం సంతోషకరమన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం దేశాన్ని పచ్చదనంగా మారుస్తుందన్నారు. ప్రతి ఒక్కరు గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో సినిమా నటుడు కాదంబరి కిరణ్; గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ; ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.

webtech_news18