టెన్నిస్ స్టార్ సానిమా మీర్జా ఇంట పెళ్లి సందడి నెలకొంది. సానియా సోదరి ఆనమ్ మీర్జా వివాహ వేడుక ఘనంగా జరుగుతోంది. ఆనమ్ మెహిందీ ఫంక్షన్లో సానియా సందడి చేసింది. కాగా, అజారుద్దీన్ కుమారుడు అసదుద్దీన్, సానియా మిర్జా సోదరి ఆనమ్ మిర్జా వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. డిసెంబరు 12న ఆనమ్-అసుదుద్దీన్ వివాహ విందు కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ సహా పలువురు ప్రముఖులను సానియా, అజారుద్దీన్ ఆహ్వానించారు .