ఐస్ హాకీ ఆడుతూ జారి కిందపడిపోయారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్. 66 ఏళ్ల పుతిన్... ఓ ఎగ్జిబిషన్ హాకీ గేమ్‌లో పాల్గొన్నారు. సోచీలోకి బ్లాక్ సీ రిసార్ట్‌లో బోల్షోయి అరేనా వద్ద స్కేటింగ్ చేస్తూ అభిమానులకు అభివాదం చేసేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో ఆయన అంచుకు వెళ్లిపోవడంతో రెడ్‌కార్పెట్‌పై తూలిపడిపోయారు. పుతిన్ పడిపోవడాన్ని గమనించి, వెంటనే స్పందించిన ఇద్దరు సభ్యులు... పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే పుతిన్ పడిపోయారు. తూలిపడిపోయినా తనంత తానుగా లేచి మళ్లీ స్కేటింగ్ చేసుకుంటూ వెళ్లిపోయారు పుతిన్. ఈ హాకీ మ్యాచ్‌లో 8 గోల్స్ చేశారు.