Kidnap : నాలుగేళ్ల జషిత్ కిడ్నాప్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కిడ్నాపులపై మరోసారి చర్చ జరిగేలా చేసింది. రాజస్థాన్... జోధ్‌పూర్‌లోని... రోజ్ మేరీ పబ్లిక్ స్కూల్‌లో... కిడ్నాప్ జరిగితే విద్యార్థులు ఎలా తప్పించుకోవాలి, ఏం చెయ్యాలి, ఎలా అరవాలి వంటి అంశాలపై ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. అన్ని వయసుల పిల్లలకూ ట్రైనింగ్ ఇస్తున్నట్లు టీచర్లు తెలిపారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ఇలాంటి శిక్షణ ఇవ్వాలంటున్నారు టీచర్లు. అన్ని స్కూళ్లలో ఇది జరిగితే... కిడ్నాపులను కొంతవరకైనా తప్పించవచ్చంటున్నారు.