బేరర్ అని పిలవగానే వచ్చి వచ్చేస్తాయి... ఆర్డర్ తీసుకొని... అద్భుతంగా సెర్వ్ చేస్తాయి. మనుషులు చేసే పనిని చక్కగా చేసేస్తున్నాయి తమిళనాడులో కొత్తగా ఏర్పాటుచేసిన రోబో రెస్టారెంట్లో రోబోలు. ఇంతకుముందు చెన్నైలో తొలి రోబో రెస్టారెంట్ ఏర్పాటైంది. జపాన్ వెళ్లిన దాని ఓనర్ అక్కడి నుంచీ రోబోలను తెచ్చి రెస్టారెంట్లో పెట్టాడు. అది సక్సెస్ అవ్వడంతో... రెండో రోబో రెస్టారెంట్ తెరిచారు. రోబోలతో సర్వీస్ అదిరిందంటున్నారు కస్టమర్లు.