కరోనా వైరస్ మన చేతులకు అంటుకున్నా.. అది పోవాలంటే... సబ్బుతో చేతులు 20 సెకండ్ల పాటు కడుక్కోవాలి. ఇలా ప్రతీ 2 గంటలకు ఓసారైనా చేస్తూ ఉండాలి. దీని కోసం హ్యాండ్ వాష్ ఛాలెంజ్ కూడా వచ్చింది. ఈ పరిస్థితుల మధ్య ఓ రాకూన్... స్వయంగా చేతుల్ని కడుక్కున్న వీడియో వైరల్ అయ్యింది. అది ముందుగా మామూలు నీళ్లతో చేతులు కడుక్కొని... తర్వాత సబ్బు నీటిలో చేతుల్ని కడుక్కొని... మళ్లీ మామూలు నీళ్లలో చేతులు కడుక్కుంది. ఇదీ చేతులు కడుక్కునే విధానం అంటే అంటూ మనకు చూపిస్తోంది.