హోమ్ » వీడియోలు » ట్రెండింగ్

Video : కారుణ్య మరణానికి ఆనుమతి ఇవ్వమంటున్న ప్రేమ జంట

ట్రెండింగ్12:58 PM July 18, 2019

కామారెడ్డి జిల్లా... పెద్ద కొడపగల్ మండలం వడ్లం గ్రామానికి చెందిన స్వరూప, పండరి మూడేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బతుకు దెరువు కోసం హైదరాబాద్ వెళ్లి పెయింటర్‌గా పండరి, దినసరి కూలీగా స్వరూప పనిచేస్తూ జీవనం సాగించారు. రెండేళ్ల వరకూ వీళ్లు సంతోషంగా ఉన్నారు. ఏడాది కిందట స్వరూపకు తీవ్ర తలనొప్పి వచ్చింది. పండరి తన దగ్గర ఉన్న డబ్బులతో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆసుపత్రిలో పరీక్షలు చేసి ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందన్నారు డాక్టర్లు. ఆపరేషన్ చేయిస్తే నయమవుతుందని చెప్పడంతో అప్పుచేసి ఆపరేషన్ చేయించాడు. వ్యాధి నయం కాకపోగా స్వరూప మంచానికి పరిమితం అయ్యింది. వ్యాధి నయం కావాలంటే మరో 5 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. రోజురోజుకూ స్వరూప ఆరోగ్యం క్షిణించి జీవచ్చవంలా మారింది. ఆపరేషన్ చేయించే స్థోమత లేక... కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు ఈ దంపతులు.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading