Sri Reddy on Maha Shivratri : టాలీవుడ్ నటి శ్రీరెడ్డి సరికొత్త గెటప్‌లో దర్శనం ఇచ్చింది. ఇప్పటివరకూ రెగ్యులర్ కాస్ట్యూమ్స్‌లోనే కనిపించే ఆమె... ఉన్నట్టుండి... పరమశివుడి గెటప్‌లో కనిపించింది. టిక్ టాక్ వీడియోలో... ఢమరుకం మోగిస్తూ... ఇద్దరు సన్యాసులతో కలిసి చిందులు వేస్తూ దర్శనం ఇచ్చింది. ఆమెను ఇప్పటివరకూ ఇలా చూడని ఆమె అభిమానులు, ప్రత్యర్థులు... ఇప్పుడు ఇలా చూసి ఆశ్చర్యపోతున్నారు. శ్రీరెడ్డి ఏంటి... సడెన్‌గా ఈ షాకింగ్ వీడియో ఏంటి అనుకుంటున్నారు. ఇంతకీ ఈ గెటప్ వెయ్యడానికి ప్రత్యేక కారణం ఏమీ లేదు. ఇటీవల కాంట్రవర్శీలకు దూరంగా ఉంటున్నానని చెబుతున్న శ్రీరెడ్డి... తాజాగా... తనకంటూ సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టుకొని అందులో వంటలు, మేకప్ టిప్స్ వంటివి చెప్పుకుంటూ తన బతుకు తాను బతుకుతున్నానని ఇటీవలే తన ఫేస్బుక్ అకౌంట్లో పెట్టిన వీడియో ద్వారా తెలిపింది. ఇలా తన కెరీర్ డెవలప్మెంట్లో భాగంగానే ఆమె... ఇటీవల ఫెస్టివల్స్, స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడు ఇలా ప్రత్యేక గెటప్స్‌లో కనిపిస్తోందని అంటున్నారు కొందరు.