Sangareddy: క్లాస్ రూమ్‌లో అల్లరి చేశాడని ఒకటవ తరగతి స్టూడెంట్‌పై తన ప్రతాపం చూపించింది ప్రధానోపాద్యాయురాలు. ఆరేళ్ల బాలుడ్ని చెప్పుతో కొట్టడమే కాకుండా తిట్టడంతో విద్యార్ధి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. దాంతో హెడ్మాస్టర్ చేసిన నిర్వాకంపై జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లారు విద్యార్ది తల్లిదండ్రులు.