నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ముస్లిం మైనారిటీలు పాలాభిషేకం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి కటౌట్ లతో పాటు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. అనంతరం ముస్లిం సంప్రదాయ అలంకరణలో ఎమ్మెల్యే కోటంరెడ్డిని సత్కరించారు. ఎన్పీఆర్లో మార్పులు చేయాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మైనారిటీలు కోటంరెడ్డిని సన్మానించారు.