వెస్టిండీస్ సిరీస్‌లో రోహిత్ శర్మ అదరగొడుతున్నాడు. మొదటి వన్డేలో సెంచరీ సాధించిన రోహిత్, ముంబై వన్డేలోనూ తనలోని ‘హిట్ మ్యాన్’ను మరోసారి చూపించాడు. 137 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్సర్లతో 162 పరుగులు సాధించి, విండీస్ బౌలర్లపై చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో విండీస్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బౌండరీ దగ్గర బ్యాటింగ్ చేస్తున్న రోహిత్‌ను చూసి... ‘రోహిత్... రోహిత్’ అంటూ అరిచారు ప్రేక్షకులు. వారివైపు చూసిన రోహిత్, ‘ఇండియా’ అంటూ అరవాలని తన టీషర్ట్పైనున్న పేరు చూపించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.